విజయవాడలోని ‘ఎంబీ సోలార్ హబ్’ (MB SOLAR HUB) సంస్థ టెలీకాలింగ్ విభాగంలో ఇంటర్న్షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 10 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంటర్న్షిప్ వ్యవధి 3 నెలలు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ. 6,000 నుండి రూ. 18,000 వరకు స్టైపెండ్ లభిస్తుంది.
అభ్యర్థులకు ఇంగ్లీష్, తెలుగు భాషలలో మాట్లాడే మరియు రాయగల నేర్పరితనంతో పాటు MS Excel లో పరిజ్ఞానం ఉండాలి.
ఆసక్తి గల అభ్యర్థులు 31 అక్టోబర్ 2026 నాటికి దరఖాస్తు చేసుకోవాలని సంస్థ తెలిపింది. ఎంపికైన వెంటనే ఇంటర్న్షిప్ ప్రారంభమవుతుంది.
MB SOLAR HUBలో టెలీకాలింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు నెలకూ రూ. 18,000 వరకు స్టైపెండ్!







