ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పాటు సంబంధిత పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.37,640 నుండి రూ.1,15,500 వరకు వేతనం లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 13, 2026 నుంచి నవంబర్ 02, 2026 వరకు APPSC అధికారిక వెబ్సైట్ (https://psc.ap.gov.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
APPSC నుంచి ఉద్యోగ ప్రకటన 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ







