Microsoft, JP Morgan, IIT, ISB మాజీ విద్యార్థులచే స్థాపించబడిన AI-ఆధారిత సాఫ్ట్వేర్ సర్వీసెస్ స్టార్టప్ ‘హైజెన్’ (Heizen), సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Fullstack + React Native) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్ లోకేషన్ లేదా రిమోట్ (వర్క్ ఫ్రమ్ హోమ్) విధానంలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు 0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారితో పాటు ఫ్రెషర్స్ కూడా అర్హులు. అభ్యర్థులకు Full Stack Development, React Native మొబైల్ యాప్ డెవలప్మెంట్, JavaScript/TypeScript, Python/Java/Go తదితర బ్యాకెండ్ భాషలు, SQL/NoSQL డేటాబేస్లు, మరియు REST APIs, AWS/GCP లాంటి క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లపై అవగాహన లేదా ఆసక్తి ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 12 లక్షల నుండి రూ. 18 లక్షల వరకు ఫిక్స్డ్ వేతనం లభిస్తుంది. దీంతో పాటు ESOPs (ఈక్విటీ/షేర్లు), పెర్ఫార్మెన్స్ ఆధారిత బోనస్‌లు, లెర్నింగ్ బడ్జెట్, మరియు నిపుణుల నుంచి మెంటార్షిప్ వంటి ప్రయోజనాలు ఉంటాయి.
క్లయింట్లు, ప్రొడక్ట్ మేనేజర్లతో కలిసి పనిచేస్తూ స్కేలబుల్ వెబ్, మొబైల్, బ్యాకెండ్ అప్లికేషన్లను డిజైన్ మరియు డెవలప్ చేయాల్సి ఉంటుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు గూగుల్ ఫామ్ లింక్ https://forms.gle/iV2kuwGEEBkCWsVZ6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే hiring@heizen.work ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
‘హైజెన్’లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు ఫ్రెషర్లకు సువర్ణావకాశం!







