Trending Posts

3,717 Jobs in intelligence bureau: డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్​ బ్యూరోలో ఉద్యోగాలు

intelligence bureau recruitment 2025

ఇండియన్ ఇంటెలిజెన్స్​ బ్యూరోలో 3, 717 ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్​లో భాగంగా అసిస్టెంట్​ సెంట్రల్​ ఇంటలిజెన్స్​ ఆఫీసర్​ గ్రేడ్​ 2( గ్రూప్​ సి) పోస్టులను భర్తీ చేయనుంది. ఏదేని డిగ్రీ పూర్తిన అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు

అసిస్టెంట్​ సెంట్రల్​ ఇంటలిజెన్స్​ ఆఫీసర్​ గ్రేడ్​ 2/ ఎగ్జిక్యూటివ్​ 3,717 పోస్టులలో యూఆర్​ 1537, ఈడబ్ల్యూఎస్​ 442, ఓబీసీ 946, ఎస్సీ 566, ఎస్టీ 226 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అప్లికేషన్​ అండ్ సెలెక్షన్​ ప్రాసెస్​

18–27 ఏళ్ల వయసు మధ్య ఉండి ఏదేని డిగ్రీ పూర్తి చేసిన వారు.(రిజర్వేషన్​ ఉన్న వారికి వయసు సడలింపు ఉంటుంది) దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫీజు రూ. 550 చెల్లించాలని ఎస్సీ, ఎస్టీ, మహిళలకు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. టైర్​ 1 లో అబ్జెక్టివ్​ టైపులో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో కరెంట్​ అఫైర్స్​, జనరల్​ స్టడీస్​, న్యూమరికల్​ ఆప్టిట్యూడ్​, రీజనింగ్​, ఇంగ్లీష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి. నెగిటివ్​ మార్కులుంటాయి.

టైర్​ 2లో డిస్క్రిప్టివ్​ ఎస్సే ఉంటుంది. 2 ఎస్సేలు 2×20, మరియు ఇంగ్లీష్​ 10 మార్కుల ఎస్సే ఉంటుంది. టైర్​ 1, టైర్​2 లోప్రతిభ కనబర్చిన వారికి టైన్​ 3లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది దశలో ఎంపికైన వారికి జీజం 44900,–రూ 1,42,400 జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు చేసేందుకు వెబ్​సైట్​ https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/94319/Index.html

3,717 Jobs in intelligence bureau: డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్​ బ్యూరోలో ఉద్యోగాలు

Leave a Comment