రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వివిధ జోన్లలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో మొత్తం 1265 ఖాళీలు ఉన్నాయి.
RRB Notification Full details
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 2026 నవంబర్ 25వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా చివరి సంవత్సరం పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు 2027 జనవరి 1 నాటికి 20 నుంచి 33 సంవత్సరాల లోపు ఉండాలి. బీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయోపరిమితి ఉంటుంది.
RRB పరీక్షా విధానం
కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. నెగిటివ్ మార్కులుంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలో పరీక్ష ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ బీసీలకు రూ. 500, ఎస్టీ, ఎస్సీ, మహిళలలకు రూ. 250 ఉంటుంది. పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఫీజును తిరిగి చెల్లిస్తారు.
RRB Exam Important Dates
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27 నుంచి ప్రారంభమైంది. చివరి తేదీ నవంబర్ 25. దరఖాస్తుల సవరణ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 7 వరకు చేసుకోవచ్చు.







