నిరుద్యోగులకు గుడ్ న్యూస్ దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి ఇండియన్ పోస్టల్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
ఖాళీల వివరాలు
- గ్రామీణ డాక్ సేవక్ (GDS)
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)
- మొత్తం పోస్టులు: 28,740
అర్హతలు
- అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి
- గణితం, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాష చదివి ఉండాలి
- ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
- సైకిల్ తొక్కడం రావాలి
వయోపరిమితి
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ఠ వయస్సు: 40 సంవత్సరాలు
- రిజర్వేషన్ ఉన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంటుంది
జీతం వివరాలు
- నెలకు రూ. 12,000 నుండి రూ. 29,380 వరకు జీతం చెల్లిస్తారు
దరఖాస్తు ఫీజు
- జనరల్ / OBC అభ్యర్థులు: రూ. 100
- SC / ST / దివ్యాంగులు / మహిళలు: ఫీజు లేదు
అప్లికేషన్ విధానం
- అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి
- ఒక పోస్టల్ సర్కిల్‌కు మాత్రమే అప్లై చేసుకోవాలి
ముఖ్యమైన తేదీలు
- వన్ టైం రిజిస్ట్రేషన్: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు
- అప్లికేషన్ సవరణ: ఫిబ్రవరి 18 నుంచి 19 వరకు
అధికారిక వెబ్‌సైట్
మరిన్ని పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
👉 https://indiapostgdsonline.gov.in/






