టాటా మెమోరియల్ సెంటర్ (TMC) లో సంగ్రూర్ ఆసుపత్రుల్లో వివిధ విభాగాల్లో పోస్ట్ ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మెడికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, జూనియర్ ఇంజనీర్, లీడింగ్ ఫైర్ మాన్, టెక్నీషియన్ విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనుంది. 27 ఏళ్ల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులు. ఉద్యోగాన్ని బట్టి రూ. 19,900 నుంచి రూ. 1,23, 100 వేతనం ఉంటుంది. ఇంటర్వ్యూ, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫేసు రూ.300 ఉంది. జూన్ 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు tmc.giv.in వెబ్ సైట్ ని సంప్రదించండి.
టీఎంసీలో పోస్టుల భర్తీ







