భారత ప్రభుత్వ రక్షణ మంత్రి శాఖకు చెందిన కాన్పూర్ లోని డిఫెన్స్ మెటీరియల్ అండ్ స్పోర్ట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పెయిడ్ ఇంటర్న్ షిప్ పోస్టులు భర్తీ చేయనుంది. మొత్తం 20 పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరిస్తుంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 15, 2026 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
నాన్ టెక్నికల్ పోస్టులు
డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC) పరిధిలోని నేషనల్ ఈ – గవర్నెన్స్ డివిజన్, సమ్మర్ ప్రోగ్రాం ద్వారా నాన్ టెక్నికల్ ఇంటర్న్ పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం 13 పోస్టులు భర్తీ చేయనుంది. అభ్యర్థులు 2026 జూన్ 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.







