యూపీఎస్ సీ( యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సెంట్రల్ గవర్నమెంట్ లో 538 గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బీ’ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతుంది. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 09, రీజనల్ డైరెక్టర్: 02, ఆపరేషన్స్ ఆఫీసర్ (డీజీసీఏ): 19, ప్రైవేట్ సెక్రటరీ: 12, అసిస్టెంట్ రిజిస్టార్: 11, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ : 05, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్: 15, ప్రిన్సిపాల్ (సీనియర్ సెకండరీ స్కూల్): 07, అసిస్టెంట్ లీగల్ అడ్వైసర్: 12, అసిస్టెంట్ డైరెక్టర్: 15, అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్టు: 05, అసిస్టెంట్ గ్రేడ్: 50 ముఖ్యమైన ఉద్యోగాలు. ఒక్కో పోస్టు ప్రకారం 30 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. జీతం పోస్టును బట్టి రూ. 44,900 నుంచి రూ, 2,18,200 వరకు ఉంటుంది. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎల్ఎల్ బీ, పీహెచ్ డీ చేసి ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు అర్హులు. స్క్రీనింగ్ /షార్ట్‌లిస్టింగ్, పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుషులకు రూ. 25. ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులు, మహిళలకు ఫీజు లేదు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేది జులై 3వ తేదీ. పూర్తి వివరాలు https:// upsc. Gov. In/ వెబ్ సైట్ ను సంప్రదించండి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు







