ఆర్ బీ ఐ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సైబర్ సెక్యూరిటీ, ఆర్టీఫిషయల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఫైనాన్సియల్ మార్కెట్, క్లైమేట్ రిస్క్ & సస్టైనబుల్ ఫైనాన్స్, పాలసీ రీసెర్చ్, పేమెంట్ సిస్టమ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 1,50,000 స్టైఫండ్ చెల్లిస్తారు. ఈ -మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.పీజీ, డిగ్రీ, పీ హెచ్ డీ చేసిన వారు అర్హులు. కొన్నిటికి పోస్టును బట్టి అర్హత ఉంటుంది. 2026 జులై 6 నాటికి 21 నుంచి 30 ఏళ్ళ వయసు ఉండాలి. 3 సంవత్సరాల ఈ కాంట్రాక్టు పని తీరు ఆధారంగా 5 సంవత్సరాలు పొడగించే అవకాశం ఉంది. దరఖాస్తులు తేదీ జూన్ 15,2026 ప్రారంభం కాగా, దరఖాస్తులకు చివరి తేదీ జులై 6. అర్హులైన యువతకు ఇది మంచి అవకాశం.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ లో పోస్టులు.







