నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీజోరాం తాత్కాలిక ప్రాతిపదికన ఇంజనీరింగ్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, పి హెచ్ డీ చేసి ఎక్స్పీరియన్స్ కలిగిన వారు అర్హులు. నెలకు రూ. 70,000 జీతం ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ జులై 10.దరఖాస్తు ఫీజు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 200 ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. దరఖాస్తును recruitmentfaculty@nitmz.ac.in మెయిల్ కు పంపాలి.
ఎన్ఐటీ మీజోరాంలో టీచింగ్ ఉద్యోగాలు..







