Trending Posts

తెలంగాణ అగ్రికల్చర్ అడ్మిషన్స్ 2026: BSc Agriculture, Horticulture, Food Science కోర్సులకు నోటిఫికేషన్ విడుదల

అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ 2026-27

ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ వ్యవసాయ, హోమ్ సైన్స్, ఇంజినీరింగ్ ఉద్యాన కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

దరఖాస్తు ప్రక్రియ

అగ్రికల్చర్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 25 నుంచి జూలై 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందులో అగ్రి, ఉద్యాన , పశువైద్య వర్సిటీలు ఉమ్మడిగా కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ సైట్ , http://www.pjtau.edu.in లేదా http://www.skltghu.ac.in సంప్రదించండి.

అగ్రికల్చర్ సీట్ల వివరాలు

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, జగిత్యాల జిల్లా పొలాస, నాగర్ కర్నూల్ జిల్లా పాలెం, సూర్యపేట జిల్లా హుజూర్ నగర్, వికరాబాద్ జిల్లా కొడంగల్, వరంగల్, రాజన్నసిరిసిల్ల, ఆదిలాబాద్, నిజామాబాద్ లోని వ్యవసాయ కాలేజీల్లో మొత్తం 13,555 బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లు ఉన్నాయి. అశ్వరావుపేట లో 30 బీఎస్సీ హర్టికల్చర్ సీట్లు, నిజామాబాద్ జిల్లా రుద్రూర్ లో ఫుడ్ సైన్స్ కాలేజీలో 29 బీటెక్ సీట్లు ఉన్నాయి. వీటి కోసం జూలై 25 లోగా ఆన్ లయైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

హర్టికల్చర్ సీట్ల వివరాలు

రాజేంద్ర నగర్, వనపర్తి జిల్లా మోజెర్ల, మహబూబాబాద్ జిల్లా మల్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 284 సీట్లు, ఉన్నాయి. వీటికి జూలై 30 లోగా ఆన్ లైన్ http://www.skltghu.ac.in వెబ్ సైట్ ద్వారాఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

elangana Agriculture Admissions 2026, BSc Agriculture, PJTAU Admissions 2026, SKLTSHU Admissions 2026, Horticulture Admission Telangana, Food Science Admission 2026, Agriculture Colleges Telangana, Telangana Degree Admissions, Agriculture Notification 2026, Rajendranagar Agriculture College

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/