Trending Posts

డేటా సెంటర్లు: టెక్ రంగానికి కొత్త బూస్టర్.. లక్షలాది ఉద్యోగావకాశాలు!

దేశంలో గత ఐదేళ్లుగా డేటా సెంటర్ల ఏర్పాటు వేగంగా పుంజుకుంటోంది. గూగుల్, అమెజాన్, ఎన్టీటీ డేటా వంటి దిగ్గజ సంస్థలు భారతదేశంలో భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేశాయి. రాబోయే ఐదేళ్లలో ఈ రంగం ద్వారా సుమారు లక్ష నేరుగా, లక్షలాది పరోక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
​వేగవంతమైన విస్తరణ:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300కు పైగా డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రస్తుత సామర్థ్యం 1.8 గిగావాట్లు కాగా, 2030 నాటికి ఇది నాలుగు రెట్లకు పైగా పెరిగి 6.5 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా. అదేవిధంగా ఈ మార్కెట్ విలువ 2030 నాటికి 20 బిలియన్ డాలర్లను దాటుతుందని భావిస్తున్నారు.
​లభించే ఉద్యోగాలు – అర్హతలు:
డేటా సెంటర్లలో బ్లూ కాలర్ బాధ్యతల నుంచి టాప్ మేనేజీరియల్ స్థాయి వరకు విభిన్న అవకాశాలు లభిస్తున్నాయి.
​టెక్నికల్ రంగాలు: క్లౌడ్ ఇంజనీర్లు, ఏఐ/ఎంఎల్ (AI/ML) నిపుణులు, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్లు, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్లు.
​కోర్ ఇంజనీరింగ్: ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, హెచ్‌వీఏసీ (HVAC) ఇంజనీర్లు, మెయింటెనెన్స్ టెక్నీషియన్లు.
​నాన్-టెక్నికల్ రంగాలు: ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, హెచ్‌ఆర్, ఫైనాన్స్ & అకౌంటింగ్.
​పాలిటెక్నిక్ డిప్లొమా, బి.టెక్, ఎం.టెక్, డేటా అనలిటిక్స్‌లో ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. లినక్స్, నెట్‌వర్కింగ్, ఫైథాన్, AWS, గూగుల్ క్లౌడ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా వేగంగా స్థిరపడవచ్చు.
​వేతనాల వివరాలు:
ఫ్రెషర్లకు ఫెసిలిటీస్ విభాగంలో రూ.6 లక్షలు, డిజైన్ రంగంలో రూ.8 లక్షలు, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ & పవర్ సిస్టమ్స్‌లో రూ.9 లక్షల వరకు వార్షిక వేతనాలు లభిస్తున్నాయి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో ప్రవేశించే నిపుణులకు సగటున రూ.10 లక్షల కంటే ఎక్కువ వేతనం అందుతోంది.
​ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ వేగంగా పెరుగుతున్న తరుణంలో, డేటా సెంటర్ ఆధారిత నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా యువత భవిష్యత్తు టెక్ కెరీర్‌కు పవర్‌ఫుల్ బూస్ట్ లభిస్తుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/