Trending Posts

హెచ్‌ఏఎల్, నాసిక్‌లో 627 అప్రెంటిస్‌షిప్ ఖాళీలు!

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), నాసిక్ ఆధ్వర్యంలోని ట్రైనింగ్ & డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ప్రకటన విడుదల కాగా, మొత్తం 627 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
​ఖాళీల వివరాలు:
​ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 133 పోస్టులు
​డిప్లొమా అప్రెంటిస్: 61 పోస్టులు
​నాన్-టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 78 పోస్టులు
​ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: 355 పోస్టులు
​అర్హత & స్టైపెండ్:
​అర్హత: సంబంధిత విభాగాలు లేదా ట్రేడుల్లో డిప్లొమా, డిగ్రీ (B.E/B.Tech, B.Pharm, B.Sc, B.Com, BBA) లేదా ITI ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు కచ్చితంగా NATS 2.0 పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
​స్టైపెండ్: గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,930; డిప్లొమా వారికి రూ.10,900; ఐటీఐ అభ్యర్థులకు రూ.10,560 నుండి రూ.11,040 వరకు చెల్లిస్తారు.
​ఎంపిక విధానం: విద్యా అర్హతల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
​ముఖ్యమైన తేదీలు:
​దరఖాస్తుకు చివరి తేదీ: 04.09.2026
​డాక్యుమెంట్ వెరిఫికేషన్: సెప్టెంబర్ 2వ-3వ వారం
​షార్ట్‌లిస్ట్ విడుదల: సెప్టెంబర్ 4వ వారం
​అప్రెంటిస్‌షిప్ ప్రారంభం: అక్టోబర్ 1వ, 2వ వారం నుంచి ప్రారంభం అవుతుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/