Trending Posts

తాండూర్ ఐసీడీఎస్ లో 51 అంగన్ వాడీ పోస్టులు నోటిఫికేషన్ విడుదల ప్రభుత్వం

తాండూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 51 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ మేరకు ఐసీడీఎస్ అధికారి శ్రీలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాండూర్ ప్రాజెక్టు పరిధిలో 23 అంగన్ వాడీ టీచర్ పోస్టులు, 28 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తులు రేపటి నుంచి (అక్టోబర్ 10)నుంచి ప్రారంభం కానున్నాయి. చివరి తేదీ అక్టోబర్ 24, సాయంత్రం 5 గంటలుదరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 లోపు ఒరిజినల్ ధ్రువపత్రాల జిరాక్స్ లను ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు https://wdcw.tg.nic.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని, అర్హతలు, వయస్సు, రిజర్వేషన్ల వివరాలను వెబ్ సైట్ లో చూడవచ్చని అధికారి సూచించారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/