Trending Posts

మహిళా, ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు DXC స్కాలర్‌షిప్ STEM కోర్సులకు రూ. 50,000 ఆర్థిక సాయం!

​DXC టెక్నాలజీ తన CSR కార్యక్రమంలో భాగంగా మహిళా మరియు ట్రాన్స్‌జెండర్ విద్యార్థుల కోసం ‘DXC ప్రోగ్రెసింగ్ మైండ్స్ స్కాలర్‌షిప్ 2026-27’ ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న అభ్యర్థులకు ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు. అర్హతలు STEM కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ చేస్తుండాలి.
​గత సెమిస్టర్/సంవత్సరంలో కనీసం 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ సాధించి ఉండాలి.
​కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ. 4 లక్షలకు మించకూడదు. DXC మరియు Buddy4Study ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు కారు. ఎంపికైన విద్యార్థులకు ఏకకాలంలో (One-time) రూ. 50,000 ఆర్థిక సాయం లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు 15 అక్టోబర్ 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలు, దరఖాస్తు కోసం www.b4s.in/yeks/DXCS8 లింక్‌ను సందర్శించవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/