ప్రముఖ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ అయిన “జార్విస్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్” (Jarvis Business Solutions Pvt Ltd) ఖాళీగా ఉన్న ఇన్సైడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ (Inside Sales Executive) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏడాదికి రూ. 3 లక్షల (3 LPA) వేతనంతో పాటు పనితీరు ఆధారంగా ఆకర్షణీయమైన ఇన్సెంటివ్‌లు లభిస్తాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు B.Tech, BBA, B.Com, MBA లేదా తత్సమాన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 2024 నుంచి 2026 మధ్య ఉత్తీర్ణులైన బ్యాచ్‌లకు చెందిన ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్సైడ్ సేల్స్, టెలికాలింగ్ లేదా బిజినెస్ డెవలప్మెంట్లో 0-1 సంవత్సరం అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులకు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్, కోల్డ్ కాలింగ్, నెగోషియేషన్, లీడ్ జనరేషన్, సేల్స్ పట్ల ఆసక్తి ఉండాలి. ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, ఆన్లైన్ రీసెర్చ్ ద్వారా కస్టమర్లను సంప్రదించి కంపెనీ సేవలను వివరిస్తూ లీడ్స్ జనరేట్ చేయడం ప్రధాన బాధ్యత.
అభ్యర్థులను హెచ్ఆర్ స్క్రీనింగ్ (HR Screening), రెండు రౌండ్ల ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 12 అక్టోబర్ 2026 లోపు ఇచ్చిన ఆన్లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు placementexe7-task@telangana.gov.in ద్వారా సంప్రదించవచ్చు.
జార్విస్ బిజినెస్ సొల్యూషన్స్‌లో ఇన్సైడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు







