దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,100 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగంలో 1,000 ‘వెల్త్ ఎగ్జిక్యూటివ్’ పోస్టులు, కార్పొరేట్ అండ్ ఇన్సిస్టిట్యూషనల్ క్రెడిట్ విభాగంలో 100 ‘క్రెడిట్ అనలిస్ట్’ పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో ప్రొఫెషనల్ అర్హత, పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారికి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ శాఖలు లేదా ఆఫీసుల్లో పోస్టింగ్ ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 16, 2026 నాటికి కేవలం ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్ (www.bankofbaroda.bank.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1100 స్పెషలిస్ట్ ఆఫీసర్ కొలువులు.. దరఖాస్తు గడువు పొడిగింపు!







