ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రాష్ట్రంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బ్రీఫ్ నోటిఫికేషన్ (నెం. 07/2026) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 163 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్లు (11), డిఎస్పీ సివిల్ (36), డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లు (35), అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ (14), మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II (12) వంటి పలు కీలక పోస్టులు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు, విద్యార్హతలు:
అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 06, 2026 నుండి అక్టోబర్ 27, 2026 (రాత్రి 11:59 వరకు) అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (డిఎస్పీ కమ్యూనికేషన్స్ పోస్టుకు సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ అవసరం).
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష: రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు (ఒక్కోటి 120 మార్కులు) ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ (1/3 వంతు) వర్తిస్తుంది.
మెయిన్స్ పరీక్ష: అర్హత పేపర్లు (తెలుగు, ఇంగ్లీష్) కాకుండా merit కోసం 5 డిస్క్రిప్టివ్ పేపర్లు (మొత్తం 750 మార్కులు) ఉంటాయి.
ఇంటర్వ్యూ: 75 మార్కులకు నిర్వహిస్తారు.
మొత్తం 825 మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
APPSC గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల. 163 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్







