ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి 20 బ్రిఫ్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ముఖ్యమైన ఖాళీలు గ్రూప్-1 సర్వీసెస్: 163 పోస్టులు
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO): 196 పోస్టులు
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III (ఎండోమెంట్స్): 104 పోస్టులు
ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్: 78 పోస్టులు
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (BC/Social/Tribal Welfare): 73 పోస్టులు
అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్: 40 పోస్టులు
హోర్టికల్చర్ ఆఫీసర్: 37 పోస్టులు
ఇతర విభాగాల్లో (ఫారెస్ట్ ఆఫీసర్స్, సూపర్వైజర్ గ్రేడ్-1, అనలిస్ట్ మొదలైనవి) పలు ఖాళీలు కలవు.
వివిధ పోస్టులకు దరఖాస్తు తేదీలు అక్టోబర్ 06, 2026 నుండి దశలవారీగా ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. గ్రూప్-1, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, హోర్టికల్చర్ ఆఫీసర్: అక్టోబర్ 06 నుండి అక్టోబర్ 27 వరకు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అక్టోబర్ 09 నుండి అక్టోబర్ 29 వరకు.
ASO, ఎకనామిక్స్ & స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్ అక్టోబర్ 13 నుండి నవంబర్ 02 వరకు.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్స్, ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ అక్టోబర్ 16 నుండి నవంబర్ 05 వరకు.
పూర్తి స్థాయి నోటిఫికేషన్లు మరియు సవివరమైన సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in ను సందర్శించవచ్చు.
APPSC నుండి 20 నోటిఫికేషన్లు విడుదల. ఖాళీల వివరాలు మరియు దరఖాస్తు తేదీలు!







