Trending Posts

వైద్య కళాశాలలో 70 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. ఈ నెల 23 వరకు దరఖాస్తుల స్వీకరణ

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 70 పోస్టులను పొరుగు సేవల పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీమ్ నోడల్ అధికారి శాంతి తెలిపారు. ఈ నెల 16 నుంచి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పని దినాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు యాదాద్రి భువనగిరి జిల్లా అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతో కలెక్టరేట్‌లోని తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ అసిస్టెంట్ మిషన్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. పోస్టులు, అర్హతలు, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/