ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి పరియోజనను అమలు చేసే ‘ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా’ (PMBI) ఒప్పంద ప్రాతిపదికన 178 మేనేజీరియల్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్ తదితర ఖాళీలు ఉన్నాయి.
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, బి.ఈ/బి.టెక్, ఎంబీఏ, పీజీ అర్హతతో పాటు అనుభవం ఉన్నవారు అర్హులు. వయోపరిమితి 28 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.32,500 నుంచి రూ.1,58,000 వరకు వేతనం లభిస్తుంది. విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబరు 24 వరకు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పీఎం బ్యూరో ఆఫ్ ఇండియాలో 178 మేనేజీరియల్ ఉద్యోగాలు







