ఆర్థికంగా వెనుకబడిన (EWS) ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులను అభ్యసించడానికి ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ (LIC GJF) “గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2026” నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న పేద విద్యార్థులకు ఏటా రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు స్కాలర్‌షిప్‌గా ఆర్థిక సాయం అందించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2026 నోటిఫికేషన్ విడుదల







