తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సంచాలకులు వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 1,743 పోస్టులకు గాను 1,588 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో మిగతా 139 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
1,000 డ్రైవర్ పోస్టులకు 894 మంది పురుషులు, 743 శ్రామిక్ పోస్టులకు 694 మంది పురుషులు, 16 మంది మహిళలు ఎంపికయ్యారు. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీ ద్వారా వివరాలు చూసుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులు వెబ్‌సైట్ నుండి పత్రాలను ప్రింట్ తీసుకుని, గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు సంబంధిత ధ్రువపత్రాల కాపీలను ఆగస్టు 17న ఎస్పీ కార్యాలయాలు లేదా కమిషనరేట్లలో సమర్పించాలి. పూర్వాపరాలు, వైద్య పరీక్షల అనంతరం తుది జాబితా వెల్లడిస్తారు.
ఆర్‌టీసీ డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాల ఎంపిక పూర్తి: 1,588 మంది ఎంపిక







