Trending Posts

ఈఎస్‌ఐసీ సనాత్‌నగర్‌లో 67 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ (ESIC) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, సనత్‌నగర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ మరియు సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 67 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
​ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మరియు సీనియర్ రెసిడెంట్.
​విభాగాలలో బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలజీ, అనాటమీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ మొదలైన పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, DNB, DM లేదా MCh పూర్తి చేసి అనుభవం కలిగిన వారు అర్హులు. 45 నుండి 69 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి వేతనం నెలకూ ప్రొఫెసర్‌కు రూ. 2,59,515; అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 1,72,572; అసిస్టెంట్ ప్రొఫెసర్ & సీనియర్ రెసిడెంట్‌కు రూ. 1,48,263 గా ఉంటుంది.
​ఎంపిక ప్రక్రియ కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. 2026 ఆగస్టు 24, 25, 26, 27, మరియు 31 ఇంటర్వ్యూ చేస్తారు.
​అడ్రెస్: అకాడమిక్ బ్లాక్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్, సనాత్‌నగర్, హైదరాబాద్.
​ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/