నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) 10వ తరగతి, 12వ తరగతి (సీనియర్ సెకండరీ) అక్టోబర్ 2026 పరీక్షలకు సంబంధించిన పూర్తి టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు అక్టోబర్ 22, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. సబ్జెక్టుల వారీగా 10వ తరగతి పరీక్షలు డిసెంబర్ 7 వరకు, 12వ తరగతి పరీక్షలు డిసెంబర్ 5 వరకు కొనసాగుతాయి. అకాడమిక్, ఒకేషనల్ (వృత్తి విద్యా) కోర్సులకు సంబంధించిన పరీక్షల తేదీలు, సమయాలను డేట్ షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ పూర్తి షెడ్యూల్‌ను అధికారిక వెబ్సైట్ sdmis.nios.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎన్ఐఓఎస్ అక్టోబర్ 2026 పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల







