Trending Posts

నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు

​గోవా, కార్వార్‌లోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్‌లో వివిధ ట్రేడులలో మొత్తం 210 అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఖాళీల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో నావల్ డాక్‌యార్డ్ కార్వార్‌లో 180, నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ గోవాలో 30 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, డీజిల్, కార్పెంటర్, వెల్డర్, క్రేన్ ఆపరేటర్ మొదలైన ఐటీఐ, నాన్-ఐటీఐ ట్రేడులలో ఖాళీలు ఉన్నాయి. 8వ లేదా 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (NCVT/SCVT) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 14 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 వరకు స్టైపెండ్ అందిస్తారు. అభ్యర్థులకు గజితం, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టులపై రాత పరీక్ష నిర్వహించి, మెరిట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా తుది ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ప్రింట్‌అవుట్‌ను ధ్రువీకరణ పత్రాలతో కలిపి ‘ది ఆఫీసర్-ఇన్-ఛార్జ్, డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్, నావల్ డాక్‌యార్డ్స్, కార్వార్, కర్ణాటక’ చిరునామాకు స్పీడ్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. దరఖాస్తుకు చివరి తేదీ నవంబరు 08, 2026.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/