డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మంచి అవకాశం కల్పించింది. మొత్తం 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులలో ఏదో ఒకదానితో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై, సంబంధిత అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.37,640 నుండి రూ.1,15,500 వరకు వేతనం లభిస్తుంది. సింగిల్-లెవెల్ ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) ద్వారా ఎంపిక చేస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 300 మార్కులకు (పేపర్-1: 150, పేపర్-2: 150) పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 13 నుండి ప్రారంభమవుతాయి. దరఖాస్తుకు నవంబర్ 2వ తేదీ చివరి గడువు. అర్హులైన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఏపీపీఎస్సీ- 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలు










