Trending Posts

ఏపీలో మరో 913 ఆశావర్కర్ పోస్టుల భర్తీకి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 1,294 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. తాజాగా మరో 913 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
​భర్తీ ప్రక్రియ: జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ‘డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ’ ద్వారా ఈ నెల 30వ తేదీలోగా నియామకాలను పూర్తి చేస్తారు.
​అర్హతలు: సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన మహిళలు 10వ తరగతి (టెన్త్) ఉత్తీర్ణులై ఉండాలి.
​వయోపరిమితి: 25 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
​గౌరవ వేతనం: ఎంపికైన వారికి నెలకు ₹10,000 అందనుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/