కాకినాడలోని జిల్లా ఉపాధి మార్పిడి కార్యాలయం (District Employment Exchange) ఆధ్వర్యంలో (ఈ రోజు) అక్టోబర్ 07, 2026న భారీ ఉద్యోగ మేళా నిర్వహించబడుతోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రత్యేక జాబ్ డ్రైవ్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ఉద్యోగ మేళాలో 5 ప్రముఖ కంపెనీలు పాల్గొని, వివిధ విభాగాలలో మొత్తం 1,150 ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
ఏ.జి ఇండస్ట్రీస్: మౌల్డింగ్ మెషిన్ ఆపరేటర్లు (200 ఖాళీలు)
ఎఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్: CC క్యామ్ అసెంబ్లీ ఆపరేటర్లు (300 ఖాళీలు)
నీమ్రానా స్టీల్ సర్వీస్ సెంటర్ (NSSI): ప్రెస్ షాప్ ఆపరేటర్లు (150 ఖాళీలు)
రాయల్ ఎన్‌ఫీల్డ్: అసెంబ్లీ ఆపరేటర్లు (200 ఖాళీలు)
యమహా: ఆటోమొబైల్ అసెంబ్లింగ్ ఆపరేటర్లు (300 ఖాళీలు)
10వ తరగతి (SSC), ఇంటర్మీడియట్, ITI, డిప్లొమా మరియు ఏదేని డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16,000 నుండి రూ.23,000 వరకు వేతనం లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో నేరుగా జిల్లా ఉపాధి కార్యాలయంలో హాజరు కావాలని అధికారులు తెలిపారు.
కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో భారీ జాబ్ డ్రైవ్ 1,150 ఉద్యోగాల భర్తీ







