ఉద్యోగార్థులకు శుభవార్త! ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) పరిధిలో భారీగా 10,743 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రతిపాదించిన ఖాళీల భర్తీకి కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం నుండి ఆర్థిక శాఖ అనుమతి రాగానే అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.
ప్రధాన ఖాళీల వివరాలు:
ఫైర్ ఆపరేటర్: 3,823 పోస్టులు
ఎమర్జెన్సీ రెస్క్యూ: 3,546 పోస్టులు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 1,153 పోస్టులు
ఈ భారీ నియామక ప్రక్రియను ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) పర్యవేక్షించి పూర్తి చేయనుంది. ఈ పోస్టులకు భారతదేశ పౌరులెవరైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు. త్వరలోనే అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు తేదీలు, అర్హతల వివరాలు వెల్లడికానున్నాయి.
ఢిల్లీ ఫైర్ సర్వీసెస్లో 10,743 ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు







