Trending Posts

​నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2,008 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు

​రాజస్థాన్‌లోని జైపూర్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) – నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) పరిధిలోని వర్క్‌షాప్‌లు, యూనిట్లలో 2,008 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్ వంటి వివిధ ట్రేడులలో ఈ శిక్షణ అందిస్తారు. కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, సంబంధిత ట్రేడులో ITI (NCVT/SCVT) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 06.11.2026 నాటికి 15 నుండి 24 సంవత్సరాల వయస్సు ఉండాలి (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు మినహాయింపు ఉంటుంది).
​మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 100 కాగా, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది.
​​ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం 07.10.2026 నుంచి
​దరఖాస్తుకు చివరి తేదీ 06.11.2026 వరకు చేసుకోవచ్చు

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/