బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ముంబయిలోని హెడ్ ఆఫీస్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 205 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ మేనేజర్ (10), సీనియర్ మేనేజర్ (49), మేనేజర్ (118), మరియు ఆఫీసర్ (28) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఫుల్-స్టాక్ ఇంజినీరింగ్, డిజిటల్ ప్లాట్ఫార్మ్స్, డేటా ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, లా, సివిల్ ఇంజినీరింగ్ వంటి అనేక విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బిఈ/బీటెక్ లేదా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. కనీస వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుండి రూ.1,20,940 వరకు వేతనం లభిస్తుంది. ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబరు 5 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 205 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్







