ఉద్యోగార్థులకు శుభవార్త! ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ లో 1,100 వెల్త్ ఎగ్జిక్యూటివ్ మరియు క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలవుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 1,100 పోస్టులు
అర్హతలు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, CA, MBA లేదా PG ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో వర్క్ ఎక్స్పీరియన్స్ (అనుభవం) కలిగి ఉండటం తప్పనిసరి.
21 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 48,480 నుండి రూ. 93,960 వరకు ఆకర్షణీయమైన పేస్కేల్ అందుతుంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ https://bankofbaroda.bank.in/ లోకి వెళ్లి ఈ నెల 16వ తేదీలోపు పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. త్వరపడండి, చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ జీతంతో 1,100 ఉద్యోగాలు!







