Trending Posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు

​తెలంగాణ ప్రభుత్వం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం పరిధిలోని బస్తీ దవాఖానాల్లో (కరకువాగు, కొత్తగూడెం, ఎల్లందు) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు మొత్తం 04 ఖాళీలు ఉన్నాయి. ఇందులో మెడికల్ ఆఫీసర్ – 03, సపోర్టింగ్ స్టాఫ్ – 01 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ (MBBS) ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
మెడికల్ ఆఫీసర్‌కు నెలకు ​జీతం రూ.42,000, సపోర్టింగ్ స్టాఫ్‌కు రూ.10,000 చెల్లిస్తారు. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబరు 15న భద్రాద్రి కొత్తగూడెంలోని డీఎంహెచ్‌ఓ (DMHO) ఆఫీస్‌లో జరిగే ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/