మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కార్యాలయం ఆధ్వర్యంలో నేషనల్ ఆయుష్ మిషన్ కింద అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలు (మొత్తం 08) ఆయుష్ డాక్టర్ – 01, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ – 02, డైటీషియన్ – 01, సైకోసోషల్ కౌన్సిలర్ – 01, యోగా ప్రొఫెషనల్ – 01, మల్టీ పర్పస్ వర్కర్ – 02 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి 7వ తరగతి, డిగ్రీ, పీజీ (ఆయుర్వేద/యూనాని/హోమియోపతి/న్యూట్రిషన్/నాచురోపతి) ఉత్తీర్ణులై, ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. 01/07/2026 నాటికి వయస్సు 18 నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి (నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది). ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నింపిన దరఖాస్తులను 2026 అక్టోబర్ 22లోగా మహబూబ్నగర్ జిల్లాలోని ‘ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ప్రాంగణం’ చిరునామాలో సమర్పించాలి.
మహబూబ్నగర్ జిల్లాలో మల్టీ పర్పస్ వర్కర్ ఉద్యోగాలు







