దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటర్ సెంటర్లలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం 951 ప్రాజెక్టు స్టాఫ్ పోస్టులు భర్తీ చేయనుంది. బెంగుళూరు 272, చెన్నై 67, నోయిడా 211, పూణే 162 , ముంబై 42, హైదరాబాద్ 76, ఢిల్లీ 03 , మోహాలి 16, కోల్కత్తా 28, తిరు అనంతపురం 25 , గోవాహాటి 46 పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రాజెక్టు టెక్నీషియన్, ప్రాజెక్టు సపోర్ట్ స్టాఫ్, సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్, ప్రాజెక్ట్ ఆఫీసు, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్టు హెడ్, తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వేతనం ఇవ్వనున్నారు. ఆయా పోస్టును బట్టి బీ ఈ, బీటెక్, ఏసి వీటి/ ఐఐటి సర్టిఫికెట్, డిగ్రీ, ఎం ఈ/ ఎంటెక్ / ఎల్ఎల్ఎం/ సిఎస్/ సీఎంఏ, /ఎంబీఏ/ పీజీ/ఎల్.ఎల్.బి, పీహెచ్డీ చేసిన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 30 ఏళ్ల నుంచి 56 ఏళ్లలోపు ఉండాలి. జూన్ 20, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సి డ్యాక్ కేంద్రాల్లో ప్రాజెక్టు స్టాఫ్ పోస్టులు







