భారత ప్రభుత్వానికి చెందిన మినీ రత్న కేటగిరి -1 సీపీఎస్సీ అయినా EdCIL లిమిటెడ్.. ఒప్పంద ప్రతిపాదికన వివిధ రకాల మల్టీ – డిసిప్లీనరీ స్టాప్, పి ఎమ్ యు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 879 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు 125, ఫిజియో థెరపిస్ట్ పోస్టులు 125, సైకాలజిస్ట్ పోస్టులు 125, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు 125, క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు 125, స్పెషల్ ఎడ్యుకేటర్- సెకండ్ ఇయర్ లెవెల్ పోస్టులు 125, స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ లెవెల్ పోస్టులు 125 , పీఎంయు కన్సల్టెంట్ పోస్టులు 4 భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత పోస్టులకు సంబంధించిన విద్యా అర్హత కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు స్పెషల్ ఎడ్యుకేటర్ కు 25000, పీఎంయు కన్సల్టెంట్ కు 50,000, ఇతర పోస్టులకు 30 వేల వేతనం ఇవ్వనున్నారు. అభ్యర్థుల వయసు 45 ఏళ్లకు మించరాదు. జూన్ 4 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. షాట్ లిస్టు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లోని వివిధ మున్సిపాలిటీలో ఉన్న ఆర్టిజం సెంటర్లలో పనిచేయాల్సి ఉంటుంది.
EdCIL లో 879 పోస్టుల భర్తీ







