Trending Posts

SSC సీజీఎల్ లోఉద్యోగాల ప్రకటన

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థలు గ్రూప్ బి, గ్రూప్ సి 12,256 పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిట్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, టాక్స్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఆయా పోస్టులకు సంబంధించిన దాంట్లో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వుడు కేటగిరి వారికి వయోపరిమితి మినయింపు ఉంటుంది. పోస్టులను బట్టి రూ. 25వేల నుంచి 1,50,000 వరకు వేతనం ఉంటుంది. మే 21వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. https://ssc.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
టైర్- 1 పరీక్ష ఆగస్టు, సెప్టెంబర్ లో ఉంటుంది. టైర్ – పరీక్ష డిసెంబర్ లో ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/