సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పలు కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఐఐటి హైదరాబాద్ సహకారంతో ఈ కోర్సులు నిర్వహిస్తోంది. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సు ఉంది. దీనికోసం ఇంటర్ ఎంపీసీలో 60 శాతం మార్పులు సాధించిన వారు అర్హులు. బీఎస్సీ ( ఆనర్స్) కంప్యూటర్ సైన్స్ అండ్ డాటా అనాలసిస్ కోర్సులో చేరాలంటే.. ఇంటర్ ఎంపీసీలో 60 శాతం మార్కులు ఉండాలి. బీఎస్సీ ( ఆనర్స్) మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సులో చేరాలంటే ఇంటర్మీడియట్ ఎంఈసి లేదా ఎంపీసీలో 60 శాతం మార్కులు ఉండాలి.
టిస్, హైదరాబాద్ సహకారంతో మరికొన్ని కోర్సులు ఉన్నాయి. ఎంఏలో పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ కోర్సులో చేరాలంటే. . ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. పూర్తి వివరాల కోసం 7382437384, 9347809918 నెంబర్లను సంప్రదించండి. అలాగే ఈ- ఈమెయిల్ admission@ssctu.ac.in , వెబ్ సైట్ www.ssctu.ac.in సంప్రదించండి.
గిరిజన విశ్వవిద్యాలయంలో పలు కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం







