Trending Posts

ఉద్యోగ అవకాశం

రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సదరన్ రీజియన్ లోని కె ఎస్ డబ్ల్యూ ఎస్ ప్రాజెక్టు కోసం ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనుంది. 53 టెక్నికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. మే 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లమా, బీఎస్సీ, బీటెక్/బీ ఈ, ఎం ఈ, ఎమ్మెస్సీ, ఎంసీఏ తో పాటు అనుభవం ఉన్నవారికి అవకాశం ఉంటుంది. అభ్యర్థుల వయసు 21 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు ఉండాలి. ఓ బి సి, ఎస్సీ, ఎస్టీ వాళ్లకి వయసులో సడలింపు ఉంటుంది. పోస్టులను బట్టి ఏడాదికి రూ. 3,68,400 నుంచి రూ. 17, 32, 810 వరకు వేతనం ఉంటుంది. ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేసుకునేవారు తమ దరఖాస్తును పూర్తి చేసి, దానికి సంబంధిత ధ్రువ పత్రాలు చేత చేసి, పోస్టు పేరును తెలుపుతూ.. టెరిటరీ మేనేజర్/ ఎస్ బి సి, రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టెరిటరీ ఆఫీస్, నెంబర్ 6/1, 12 వ మెయిన్, వసంత్ నగర్, ఓపిపి, మౌంట్ కర్మెల్ కాలేజ్ గేట్-1 రోడ్డు, బెంగళూరు – 560052 అడ్రస్ కు స్పీడ్ పోస్ట్ చేయా లి. ఇంటర్వ్యూ వివరాలను ఈమెయిల్ ద్వారా చెబుతారు. పూర్తి వివరాలకు https:/ / www.railtel.in వెబ్ సైట్ ను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/