Trending Posts

ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ పోస్టులు

ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ ముంబై డిప్యూటీ మేనేజర్ పోస్టులు భర్తీ చేయనుంది. మొత్తం ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 60% మార్కులతో సంబంధిత విభాగంలో బి ఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎ
ఎం ఈ, కంప్యూటర్ సైన్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ తో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 48, 480 నుంచి రూ. 85, 920 వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థి వయసు 28 ఏళ్లు మించి ఉండరాదు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టి వికలాంగులకు రూ. 100, ఇతరులకు రూ.600 ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూన్ 14వ తేదీ 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి. జులై నెలలో పరీక్ష ఉంటుంది. పూర్తి వివరాలకు www.eximbankindia.in వెబ్ సైట్ ను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/