Trending Posts

నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని యువత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త చెప్పింది. వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కొత్తగా మూడు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు పిజిపిఎస్ చైర్మన్ బుర్ర వెంకటేష్ ప్రకటించారు. ఇప్పటికే 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యధికంగా అటవీ శాఖలో 3093 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. వీటితోపాటు వివిధ శాఖలను ఒక్కో పోస్ట్ ఖాళీగా ఉన్న 25 పోస్టులు భర్తీ చేయనుంది. అలాగే భవిష్యత్తులోనూ పోస్టుల భర్తీకి సంస్కరణలు తీసుకురానుంది. భవిష్యత్తులో నిర్వహించే పరీక్షలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా. . లీకేజ్ కాకుండా.. పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించాలని నిర్ణయించింది. యూపీఎస్సీ తరహాలో పరీక్షల నిర్వహణకు ” ప్రతిభా భారతి” అనే సరికొత్త పద్ధతిని తీసుకురానున్నట్లు వెల్లడించింది. టీజీపీఎస్సీ ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశాభావం వ్యక్తమౌతుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/