నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 21వ తేదీన నిర్వహించనున్న NEET పరీక్ష అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డు ఎన్టిఏ విడుదల చేసింది. జూన్ 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in వెబ్సైట్ నుంచి తమ లాగిన్ వివరాలను పొందుపరిచి అడ్మిట్ కార్డును పొందవచ్చు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును పొందే ముందే ఫీజు రీఫండ్ కోసం తమ బ్యాంకు వివరాలను చూసుకోవాలి. అడ్మిట్ కార్డు లోనే అభ్యర్థి కేటాయించిన పరీక్ష కేంద్రం ఉంటుంది. అలాగే అందులో పొందుపరిచిన సలహాలు చూసినవి తప్పనిసరిగా అభ్యర్థి చదువుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసే క్రమంలో ఏదైనా సహకారం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను 011-40759000, 011- 69227700 సంప్రదించవచ్చు. అలాగే neetug2026@nta.ac.in ఈమెయిల్ ఐడి ద్వారా కూడా సంప్రదించవచ్చు. గతంలో నీట్ పరీక్ష నిర్వహించినప్పటికీ.. పరీక్ష పేపర్ లీక్ కావడంతో రద్దు చేసిన విషయం తెలిసింది. ఈ క్రమంలోని మరోసారి జూన్ 21న ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
అందుబాటులో NEET అడ్మిట్ కార్డు







