తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీల్లో టీచర్, ఆయా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబునగర్, ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడేం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ సారి అంగన్ వాడీ జాబ్స్ సెలెక్షన్ ప్రాసెస్ లో మార్పులు చేశారు.
అంగన్ వాడీ జాబ్స్ అర్హతలు telangana Anganwadi Recruitment 2026
- అంగన్ వాడీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మొదటగా స్థానిక మహిళలై ఉండాలి. పోస్టు ఖాళీగా ఉన్న గ్రామానికి చెందిన వారై, అక్కడ కేటాయించిన పోస్టుకు సంబంధించి రిజర్వేషన్ కలిగిన వారై ఉండాలి. జనరల్ వస్తే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
- గిరిజన, ఆదివాసి, తండాల్లో ఆయా పోస్టులకు కేవలం ఎస్టీ కేటగిరి వారై ఉండాలి.
- జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దీనికి 10 మార్కులు కేటాయించారు.
- అంగన్ వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు ఇంటర్ పాసై ఉండాలి. ఇంటర్ చేసిన వారు లేని పక్షంలో పదో తరగతి చదివిన వారికి అవకాశం కల్పిస్తారు.
- ఇంటర్ లో వచ్చిన మార్కులు, 70 శాతం వెయిటేజీ, వితంతువు అయితే 5శాతం, అనాథలకు 10శాతం, దివ్యాంగులకు 5శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా 10 మార్కులు కేటాయిస్తారు. చివరగా అన్నింటిలో వెయిటేజీ ఆదారంగా ప్రతిభ కలిగిన వారికి ఉద్యోగం ఇస్తారు.
మీ జిల్లాలో ఖాళీల వివరాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి.
Telangana Anganwadi Notification 2026, Telangana Anganwadi Recruitment 2026, Anganwadi Teacher Jobs Telangana, Anganwadi Helper Jobs, తెలంగాణ అంగన్‌వాడీ నోటిఫికేషన్, అంగన్‌వాడీ టీచర్ అర్హతలు, అంగన్‌వాడీ ఎంపిక విధానం







