భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వివిధ రకాల టెక్నీషియన్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రొసెస్ టెక్నీషియన్ (కెమికల్) 60, ప్రొసెస్ ఆపరేటర్ 64, టెక్నీషియన్/ఆపరేటర్ (మెకానికల్) 13, టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) 17 చొప్పున మొత్తం 154 ఖాళీలు ఉన్నాయి.
సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిప్లొమా/బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉన్నవారు అర్హులు. జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ. 26,500 నుండి రూ. 34,000 వరకు వేతనం లభిస్తుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), స్కిల్ టెస్ట్, మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 29, 2026 నుండి ఆగస్టు 13, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
బిపిసిఎల్ (BPCL)లో 154 టెక్నీషియన్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్







