Trending Posts

స్విమ్స్ తిరుపతిలో 236 స్టాఫ్ నర్స్ పోస్టులు: ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం


తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) పాలనలోని శ్రీ వేంకటేశ్వర ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి ప్రత్యక్ష నియమకాల ద్వారా స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 236 పోస్టులను భర్తీ చేయనుండగా, వీటిలో 212 రెగ్యులర్ ఖాళీలు, 24 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
​విద్యా అర్హతలు:
​అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్‌ (B.Sc Nursing) లో ఉత్తీర్ణులై, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
​లేదా ఇంటర్మీడియట్ తో పాటు మూడేళ్ల జనరల్ నర్సింగ్ (GNM), ఆరు నెలల మిడ్‌వైఫరీ ట్రైనింగ్ పూర్తి చేసి, మెడికల్ కాలేజీ లేదా టెర్షియరీ కేర్ ఆసుపత్రిలో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
​వయోపరిమితి & వేతనం:
​వయోపరిమితి: 01-07-2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
​వయోసడలింపు: ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), ఈడబ్ల్యూఎస్ (EWS) వర్గాలకు 5 ఏళ్లు మరియు పిడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు 10 ఏళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
​వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 38,720 నుండి రూ. 1,18,390 వరకు వేతనం చెల్లిస్తారు.
​ఎంపిక విధానం & దరఖాస్తు గడువు:
​ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
​దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
​చివరి తేదీ: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 10, 2026.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/