Trending Posts

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో తెలంగాణలో 41, ఆంధ్రప్రదేశ్‌లో 04 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో పాటు కనీసం ఒక సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం మరియు స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి. వయసు 20 నుండి 30 ఏళ్లు ఉండాలి. SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది. నెలకు జీతం రూ. 48,480 నుంచి రూ. 85,920 వరకు ఉంటుంది. 150 మార్కులకు నిర్వహించే ఆన్‌లైన్ రాత పరీక్ష (0.25 నెగెటివ్ మార్కింగ్), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు స్థానిక భాషా పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది. ​దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ. 1,180; SC/ST/దివ్యాంగులకు రూ. 59 ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 16 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు ఆగస్టు లేదా సెప్టెంబరు 2026లో జరగనున్నాయి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/