న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL), నరోరా అటామిక్ పవర్ స్టేషన్ (NAPS)లో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీన నిర్వహించే వాక్-ఇన్-ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు.
ఫిక్స్డ్ టర్మ్ మెడికల్ ఆఫీసర్ – 03 ఖాళీలు
పీడియాట్రీషియన్, డెంటల్ సర్జన్, జనరల్ డ్యూటీ తదితర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్/ ఎంఎస్/ ఎండీ/ డీఆర్ఎమ్/ పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి గరిష్ఠంగా 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు ఉండాలి.
నెలకు జీతం రూ. 1,27,000 నుంచి రూ. 1,76,500 వరకు ఉంటుంది.
ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ 25-08-2026 న ఉంటుంది.
వేదిక: నీలకంఠ్ గెస్ట్ హౌస్, ఎన్ఏపీఎస్ టౌన్షిప్, నరోరా, జిల్లా: బులంద్ షహర్, ఉత్తరప్రదేశ్.
ఎన్పీసీఐఎల్లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు







