ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) గోవాలోని మెడికల్ కాలేజ్ & హాస్పిటల్లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 107 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
ఖాళీల వివరాలు:
ప్రొఫెసర్ – 15, అసోసియేట్ ప్రొఫెసర్ – 21, అసిస్టెంట్ ప్రొఫెసర్ – 36, సీనియర్ రెసిడెంట్ – 35.
అర్హత & వేతనం:
సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/పీహెచ్‌డీతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,18,500, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.78,800, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు సీనియర్ రెసిడెంట్‌కు రూ.67,700 వేతనంగా చెల్లిస్తారు.
ఎంపిక & దరఖాస్తు విధానం:
ఇంటర్వ్యూ ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు రూ.500 రుసుము కాగా, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఆసక్తి ఉన్నవారు ఈమెయిల్ (deanmargao@gmail.com) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు 2026 సెప్టెంబరు 1న ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ వేదిక: కాన్ఫరెన్స్ రూమ్, 1st ఫ్లోర్, ఈఎస్ఐసీ హాస్పిటల్, మడ్గావ్, గోవా- 403601.
ఈఎస్ఐసీలో 107 ఫ్యాకల్టీ ఖాళీలు: 2026 సెప్టెంబరు 1న ఇంటర్వ్యూలు










